పాలకొల్లు లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈగిల్ క్లబ్, రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు టౌన్ సీఐ రజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు వివరించారు. ఇంచార్జ్ ప్రిన్సిపల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్