పాలకొల్లులో టెన్త్ క్లాస్ పాసైన తల్లీకొడుకులు బండారు లక్ష్మీ లహరి, కుమారుడు విజయ్‌లను మంత్రి లోకేశ్ ట్విటర్ వేదికగా అభినందించారు. గృహిణిగా ఉంటూ చదువుకోవాలనే సంకల్పంతో ఓపెన్ స్కూల్‌లో చేరి టెన్త్ పరీక్షలు రాసి పాసైన లక్ష్మీ లహరిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. తల్లీకొడుకులు ఫలితాల కోసం ఎదురుచూసిన ఉద్విజ్ఞ క్షణాలు, పాసైన ఆనందానుభూతిని పరస్పరం అభినందించుకున్న దృశ్యం ఒక అద్భుతమని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.