పాలకొల్లులో పదో తరగతి పరీక్షల్లో తల్లి, కొడుకులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి APPOS ద్వారా పదో తరగతి పరీక్షలు రాసి, 562/600 మార్కులు సాధించారు. ఆరో తరగతితో చదువు ఆపేసిన ఆమె, తన కుమారుడితో పాటు పరీక్షలు రాసి 360/500 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫలితాలు విడుదలైన అనంతరం తల్లి, కొడుకులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ విజయంపై పలువురు వారిని అభినందిస్తున్నారు.