ప.గో: బాత్‌రూంలో పసికందు.. CC కెమెరాలు పట్టేశాయి!

విజయవాడ కృష్ణలంకలో బుధవారం అప్పుడే పుట్టిన నవజాత శిశువును బాత్‌రూంలో వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ పసికందును గుర్తించారు. తల్లిదండ్రులు పాలకొల్లు సమీపంలోని లంకలకోడేరుకు చెందిన వారిగా గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు వారిని ఆదుకుంటామని హామీతో చిన్నారిని వారికి అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు చిన్నారికి ‘త్రినేత్రి’గా నామకరణం చేశారు.

సంబంధిత పోస్ట్