పాలకొల్లు మండలం అరట్లకట్ట శివారు కమ్ము వద్ద శనివారం సాయంత్రం టిప్పరు ఢీకొన్న ఘటనలో 13 ఏళ్ల బాలిక మనీషా అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ద్విచక్ర వాహనం నడుపుతున్న దాసరి ప్రియాంక గాయాలతో బయటపడింది. నిత్యావసర సరకుల కొనుగోలు నిమిత్తం పోడూరు మండలం కొమ్ముచిక్కాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పరు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.