అరటికట్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎస్‌వీ ఆర్ మూర్తిరాజు (61) గుండె పోటుతో తూగో జిల్లా నల్లజర్లలో సోమవారం మరణించారు. శిక్షణ తరగతుల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురవగా, వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని పాలకొల్లు హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని స్వగృహానికి తీసుకువచ్చారు.