ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, న్యాయవాదులు, ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆదివారం రాత్రి మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్‌కు మంత్రి సూచించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను లీగల్ టీమ్‌కు అందించాలని ఆదేశించారు.