పాలకొల్లు: పంచారామ క్షేత్రం మూసివేత

మంగళవారం చంద్రగ్రహణం కారణంగా, పంచారామ క్షేత్రం పాలకొల్లులోని శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంను మూసివేశారు. మార్చి 4న బుధవారం ఉదయం 5:30 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తామని ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్