పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు, జగన్ హయాంలో పేదలకు వైద్యసాయం అందక మానవత్వం మరిచిపోయారని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్ర వనరులు దోచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి కష్టమైనా చంద్రబాబు మళ్లీ సీఎంఆర్ఎఫ్ ను ప్రారంభించారని గుర్తుచేశారు.