మంత్రి నిమ్మల రామానాయుడుని పాలకొల్లులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవి శనివారం కలుసుకున్నారు. టి. నర్సాపురం బస్టాండ్ వద్దగల ఎర్రచెరువు ప్రాంతంలో నివాసం వుంటున్న 100 మంది పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ళ పట్టాలు మంజూరుచేసి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సంభందింత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.