పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని శ్రీ వరాల నాగకన్య అమ్మవారి ఆలయంలో రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరై పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో పాల్గొని భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు.