పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వైకాపా హయాంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వెంటిలేటరుపై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూకు తీసుకువచ్చామని తెలిపారు.