పాలకొల్లు: మహిళ అనుమానాస్పద మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పెంకిళ్లపాడు టిడ్కో ఇళ్ల సముదాయంలోని సీ బ్లాక్‌లో ఉంటున్న తాడి రాధ నాలుగో అంతస్తు నుంచి పడి అనుమానాస్పదంగా మరణించింది. రాధతో సహజీవనం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తి తోసి చంపేశాడని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నాడు. కాగా సుధాకర్ పరారీలో ఉన్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్