డిసెంబర్ 5 నుంచి హర్యానాలో జరిగే 69వ జాతీయ అండర్ -19 ఫొటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికకావడం ఆనందదాయకమని యువ క్రికెటర్ షేక్ సమీరుద్దీన్ అన్నారు. సోమవారం పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచి క్రికెట్ పై ఉన్న ఇష్టంతో కుటుంబసభ్యులు, కోచ్ ప్రోత్సాహంతో జిల్లా అండర్ -17, 19 జట్లలో కెప్టెన్ గా ఉత్తమ ప్రదర్శనకు గాను రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యానని, భవిష్యత్తులో ఇండియా టీమ్ లో ఆడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.