పశ్చిమ గోదావరి టెన్త్ ఫలితాలు: సాయి పల్లవికి ప్రథమ స్థానం

పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మహాదేవపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి చెన్నంశెట్టి సాయి పల్లవి 600కు 576 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. యండగండి పాఠశాల విద్యార్థి MVSD వినయ్ 574 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని P. కార్తీక నాగశ్రీ 559 మార్కులతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షల్లో తమ ప్రతిభను చాటారు.

సంబంధిత పోస్ట్