పాలకొల్లును కమ్మేసిన పొగ మంచు

వాతావరణంలో మార్పుల కారణంగా పాలకొల్లు నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజామున రహదారులు కనిపించక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లలేకపోయారు. మరోవైపు చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు చలికి వణికిపోయారు.

సంబంధిత పోస్ట్