పాలకొల్లు హౌసింగ్ బోర్డులో తాళం వేసిన ఇంటి గోడకు శుక్రవారం రాత్రి దుండగులు రంధ్రం చేసి బంగారం, నగదు చోరీకి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బీరువాలో ఉన్న ఏడు కాసుల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.