పాలకొల్లులో దాసరికి నివాళి

పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నటుడిగా, రచయితగా, శతాధిక చిత్రాల దర్శకుడిగా దాసరి సాధించిన విజయాలను పలువురు స్మరించుకున్నారు. సమాజంలోని లోపాలను తన సినిమాల ద్వారా ఎండగట్టి, రికార్డులు సృష్టించి, పాలకొల్లు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్