ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళకు కుక్క అడ్డు రావడంతో కిందపడి తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. యలమంచిలి మండలం కొంతేరు గ్రామానికి చెందిన కత్తుల రూతు (47) ఈ నెల 25న ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై నరసాపురంలో ఆమె పుట్టింటికి బయలుదేరారు. సగం చెరువు సమీపాన కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.