యలమంచిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన
విడుదల చేశారు. ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండల పరిషత్ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.