వైసిపి గొడ్డలి పార్టీగా రూపాంతరం చెందింది.. మంత్రి నిమ్మల

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో శుక్రవారం  జరిగిన మీడియా సమావేశంలో వైసిపి పార్టీని 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణించారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి కూటమి ప్రభుత్వంలో వికాసం వైపు పరిపాలన సాగుతోందని, అయితే అధికారం కోసం వైసిపి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. గత ముఖ్యమంత్రి బయటకు రావాలంటే పరదాలు చాటున భారీ వృక్షాలు నరికించి, భారీ గేట్లతో బయటకు వచ్చేవారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్