పోలవరం మండలం ఇటుకలకోటలో శనివారం తెల్లవారుజామున పెద్దపులి ఒకే రైతుకు చెందిన రెండు లేగ దూడలను హతమార్చింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైల్డ్ లైఫ్ వన్య ప్రాణి విభాగం సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి, పులి సంచారంపై ఆందోళన చెందుతున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి జాడలను గుర్తించి, అది ఎటు వెళ్లిందో అధికారులు విచారణ చేపట్టారు.