పోలవరంలో ఆదివారం రాత్రి కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ సంఘటన పోలవరం ప్రాంతంలో రాజకీయ వేడిని పెంచింది.