తెడ్లం గ్రామంలో శుక్రవారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేతిరెడ్డి వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. పెదప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సేవలందిస్తోంది" అని తెలిపారు. అలాగే గ్రామానికి ఏడు కొత్త పెన్షన్లు మంజూరు అయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఎంఆర్‌డీ ప్రసాద్, దించినాల బ్రమ్మం, కూటమి నాయకులు పాల్గొన్నారు.