పోలవరం: వేలేరుపాడు వంతెన వద్ద రాక పోకలకు అంతరాయం

గోదావరి నదిలో వరద పెరుగుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. భద్రాచలం వద్ద శుక్రవారం 37 అడుగులకు చేరి వరద ప్రవహిస్తుంది. వేలేరుపాడు మండలంలోని 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మండలంలోని బోళ్లపల్లి , ఎడవల్లి గ్రామాల మధ్య ఎద్దు వాగు వంతెన పైకి గోదావరి వరద నీరు చేరింది. 19 గ్రామాలకు అటు వెళ్లే చిట్టెం రెడ్డిపాలెం, ఎడవల్లి, కట్కూరు, కోయిదా తదితర ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్