మహారాష్ట్ర వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి పోలవరం స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.50 మీటర్లకు చేరగా, 48 గేట్ల ద్వారా 7.50 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ కొండ మెట్ల వరకు నీరు చేరింది. రేవులాంచీ రాకపోకలు నిలిపివేశారు.