బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురుపూజోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం పట్టణంలో బిజెపి శ్రేణులు బ్రహ్మశ్రీ పెద్ది రామాన్ని గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా గురువులకు భారతదేశంలో ఉన్న ప్రాధాన్యతను పలువురు మాట్లాడారు. గురువుల గొప్పదనాన్ని కీీర్తించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.