పేద ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఒకేసారి పెన్షన్ మొత్తాన్ని పెంచి పంపిణీ చేస్తూ సామాజిక న్యాయం సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో శుక్రవారం పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మండలంలో నూతనంగా అర్హత పొందిన 54 స్పౌస్ పెన్షన్లను ప్రకటించామని, వాటిని లబ్ధిదారులకు అందజేశామన్నారు.