ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయిన కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన కొండేపాటి అన్వేష్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు శుక్రవారం రక్షించారు. బంధువుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఐ వి. చంద్రశేఖర్, నల్లజర్ల ప్రాంతంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న అన్వేష్‌ను గుర్తించి రక్షించారు. అనంతరం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు.