కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కుక్కునూరు మండలం సీతారాంపురానికి చెందిన సుబ్బారావు (48) బంధువుల ఇంటికి పెళ్లి దుస్తులు తీసుకెళ్లేందుకు గురువారం అశ్వారావుపేట వచ్చి తిరిగి బైకుపై బయలుదేరాడు. ఊట్లపల్లి వద్ద దుస్తులు కిందపడుతున్నాయనుకొని అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒక్కసారిగా బండితో సహా కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సుబ్బారావు తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన అశ్వారావు పేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్