కుక్కునూరు మండలం సీతారామనగరంలో 27 టాక్స్ చెల్లించని తెలంగాణ మద్యం సీసాలతో ఓ వ్యక్తిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీను బాబు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపెరిండెంట్ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.