పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయిగూడెం మండలంలోని విద్యా రోహిణి డిజిటల్ స్కూల్‌లో గురువారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు కలిసి పని చేయాలని ప్రిన్సిపాల్ కొండేపాటి రామకృష్ణ, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ వెలగ మాధవరావు సూచించారు. అనంతరం డిజిటల్ బోర్డు ద్వారా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు.