పోలవరంలో శుక్రవారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిందని అన్నారు.