పోలవరం: బీసీ మహిళపై దాడి అమానుషం

కూటమి పాలనలో దౌర్జన్య కాండ కొనసాగుతోందని ఏలూరు జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చిటికిన శ్రీనివాస్ ఒక ప్రకటనలో అన్నారు. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు బీసీ మహిళ, గౌడ కులానికి చెందిన ఉప్పల హారికపై టీడీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. బీసీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం బీసీలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందని అన్నారు. తక్షణమే ఉప్పల హారికపై దాడికి పూనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్