పోలవరం: గోదావరికి తగ్గుముఖం పట్టిన వరద

గోదావరి వరద తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం సోమవారం సాయంత్రం 23.2 అడుగులకు చేరింది. కుక్కునూరులో గుండేటి వాగు వరకు గోదావరి తగ్గిపోయింది. గొమ్ముగూడెం నుంచి దాదాపు 250 కుటుంబాలు దాచారం పునరావాస కాలనీకి తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెంలో పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో వారంతా గొమ్ముగూడెంలోను ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్