ఎగువ రాష్ట్రాలు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉపనదులు పొంగడం, కొండవాగుల ఉధృతితో గోదావరిలో వరద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 26.5 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి చేరిన 2,86,205 క్యూసెక్కుల అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.700 మీటర్లు, దిగువన 19.200 మీటర్లు, ఎగువ కాపర్‌డ్యామ్‌కు ఎగువన 28.900 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్‌కు దిగువన 18.350 మీటర్లు, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల మధ్య 15.800 మీటర్లు నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్ట్ దిగువన 7.30 మీటర్లు నీటిమట్టం నమోదైందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.