పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఆయన వివరించారు. నదిలో వ్యర్థాలు కలవకుండా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. పుష్కరాలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.