పోలవరం: తగ్గిన వరద ప్రవాహం

ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం ఉదయానికి నీటిమట్టం 30.20 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం 48 గేట్ల ద్వారా 5.21 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వెళ్తుంది. ఈ నెల 12 వరకు వరద పెరగడంతో 48 గేట్ల ద్వారా 7.61 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్లగా ఇప్పుడు నీటిమట్టం తగ్గుతుండటంతో ఇసుక తిన్నెలు బయటపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్