దివ్యాంగురాలిపై అత్యాచారం: నిందితుడు ఏసు అరెస్ట్

సాంకేతిక పరిజ్ఞానం, DNA పరీక్షల సాయంతో పోలీసులు చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో జరిగిన అత్యంత క్లిష్టమైన అత్యాచార కేసును ఛేదించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన కొప్పుల ఏసు (30) లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, 45 మంది అనుమానితులను విచారించి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని అతి తక్కువ కాలంలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాలను అభినందించారు. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్