టి. నరసాపురంలో తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని, నాయకులు ఎన్టీఆర్ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ శివారులోని కళ్యాణమండపంలో జరిగింది.