టి. నరసాపురం: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

టీ. నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామ శివారులో బుధవారం పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జయబాబు మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్నారన్న ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ. 43 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్