పదో తరగతి ఫలితాల్లో బుట్టాయగూడెం పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయురాలు కె. సుబ్బలక్ష్మి తెలిపారు. సిహెచ్. జైపాల్ 562 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, ఎ. నవ్య (525), ఎం. మధుర గీతిక (495) కూడా మంచి మార్కులు సాధించారు. మొత్తం 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 48 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ విజయం విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.