పాత పట్టిసీమ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నిఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ డైరెక్టర్ కొవ్వాడ సి జగదీశ్వర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ, కేకు కటింగ్ జరిగింది. పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కంఠం కార్యదర్శి పూడి సత్యనారాయణ, తెలుగు యువత జనరల్ సెక్రటరీ అనేపల్లి హరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.