వేలేరుపాడు మండలంలో అక్రమంగా నాటు సారాతో ఉన్న వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లపల్లిలో సున్నం ముత్యాలు నాటుసారా అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు కుక్కునూరు సీఐ, వేలేరుపాడు ఎస్సైతో కలిసి తనిఖీ చేయగా అతని వద్ద ఐదు లీటర్ల నాటు సారా లభించింది. ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.