వేలేరుపాడులో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ను శనివారం  ప్రారంభించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, శాఖమూరి సంజీవులు, ఎస్సై నవీన్ కుమార్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆటల వైపు ప్రోత్సహించాలని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 10,116, రెండవ బహుమతిగా 5,116 ప్రకటించారు. యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్