వేలేరుపాడులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనపై పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బాధితులకు ప్రభుత్వం, పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.