కుక్కునూరు, జనవరి 29: కార్పొరేట్ల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను అమల్లోకి తెచ్చిందని, కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఈ చట్టాలు తీసుకువస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ ఆరోపించారు. ఈ కోడ్స్ కార్మిక హక్కులను తొలగిస్తాయని, 29 కార్మిక చట్టాలు రద్దు అయ్యాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. వీటిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిషన్ మోర్చా ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కేరళ ప్రభుత్వం ఈ కోడ్స్ అమలు చేయనని స్పష్టం చేసింది.