రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు శుక్రవారం పోలవరంలో మాట్లాడుతూ, తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత దారుణమని, ఇది అపరాధమని విమర్శించారు. సిట్ నివేదికతో గత ప్రభుత్వం చేసిన కుంభకోణం బయటపడిందని, రాష్ట్ర ప్రజలెవరూ వైసీపీని నమ్మే స్థితిలో లేరని, పవిత్ర క్షేత్రం విషయంలో జరిగిన అన్యాయంపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.