లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బోడపాడుకు చెందిన పత్తివాడ లక్ష్మి వద్ద గొలుసును దొంగిలించిన నిందితుడు జొన్నల వెంకటేశ్‌కు 13 నెలల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం మెజిస్ట్రేట్ లలిత దేవి తీర్పునిచ్చారు. 2017లో జరిగిన ఈ చోరీ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశామని ఎస్సై స్వామి తెలిపారు.