తాడేపల్లిగూడెం: 34 వేల పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి

తాడేపల్లిగూడెం పరిధిలోని 10 మండలాల్లో 90,500 పశువులకు గాను 34 వేల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం పూర్తయింది. పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్.కే. సుధాకర్ శనివారం పెంటపాడు కార్యాలయంలో మాట్లాడుతూ వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, ఏప్రిల్ 15వ తేదీ వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్